స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు రాగా. అవి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం చిత్ర షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టర్ రేపు దసరా కానుకగా పోస్టర్ ఒకటి రిలీజ్ చేసాడు. అది చూసిన అభిమానులు డైరెక్టర్ పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇంతకముందు బన్నీ ఫస్ట్ లుక్ చూసి చాలా సైలెంట్ గా ఉండబోతున్నాడని అందరు భావించారు. కాని ఇది చూసాక రెండో ఏంగిల్ బయటపడింది. ఈ పోస్టర్ ఒక ఎరుపు దుపట్టా ఉంది.. మరి ఈ రంగు విషయంలో పవన్ కళ్యాణ్ చాలా ఫేమస్ అయ్యాడు మరి బన్నీ కి అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.
