ఏపీ అధికారక పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ మారబోతున్నారా..?. ఇప్పటికే ఆయనపై పలు వార్తలు మీడియాల్లో వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే. అయితే తనపై వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొంతమంది కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తోన్నారు. నేను పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. గత ఎన్నికల్లో టీడీపీ ప్రత్తిపాడు నుంచి సీటు ఇవ్వకపోతే నేను వైసీపీలో చేరాను. నేను ఎప్పటికి వైసీపీలోనే ఉంటాను అని ఆయన అన్నారు.
