దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా తుది గెలుపు మంచినే వరిస్తుందనే విషయం మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో తులతూగాలని దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పా రు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దుర్గాష్టమి, మహార్నవమి, విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
