నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని, ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. విచారణ జరిపి తనపై తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి పేర్కొన్నారు.