విశాఖపట్నం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించి. అయితే ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు సాధించారు. అటు సౌతాఫ్రికా ఇటు ఇండియా రెండు జట్లు రికార్డులు సాధించాయి. ఓపెనర్ రోహిత్ శర్మ తాను ఓపెనర్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
ఇక టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 350వికెట్లు పడగొట్టాడు. కేవలం 66టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ మురళీధరన్ రికార్డును సమానం చేసి ఇద్దరూ మొదటి స్థానంలో నిలిచారు.
సౌతాఫ్రికా టెయిలెండర్ పీయుడ్త్ 10 వస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించడం ద్వారా భారత్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా తరఫున ఆ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇక చివరిగా టీమిండియా-సౌతాఫ్రికా రెండు ఇన్నింగ్స్ లో కలిపి 37 సిక్స్ లు కొట్టాయి. తద్వారా 2014-15లో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ లో 35కొట్టిన రికార్డును బ్రేక్ చేసింది.