టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ తాజాగా చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఇరు జట్ల క్రికెటర్లకు ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతను మరింత పెంచారు. అదే సమయంలో విశాఖ తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. మరొకవైపు విశాఖ స్టేడియంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోస్ట్‌గార్డ్, నేవీలతో మెరైన్ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. విశాఖ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రస్తుతం నగరంలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. ఆదివారం ఇక్కడ చివరి రోజు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్ర ముప్పు అంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడంతో క్రికెటర్లకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
