హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా పాల్గొని రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ, చండీ నామం, దుర్గాసప్తశతిపూజ, స్పటిక శివలింగానికి రుద్రాభిషేకం వంటి పూజలు చేస్తూ, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. తదనతరం ప్రతినిత్యం వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన చారిత్రక దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను స్వామివారు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 5, శనివారం నాడు ధర్మారం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామిజీ ఈ సందర్భంగా భక్తులకు హిందూ ధర్మం విశిష్టతపై సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్‌రెడ్డి , దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
