విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజే చివరిరోజు కావడంతో మ్యాచ్ ఎవరికీ సొంతం కానుంది అనేది చాలా ఆశక్తిగా మారింది. కాని చివరికి ఇండియన్ బౌలర్ షమీ మలుపు తిప్పేసాడు. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడింది సౌతాఫ్రికా. మరి మ్యాచ్ ను కనీసం డ్రా ఐనా చేస్తారా అనే విషయానికి వస్తే టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది. దాంతో ఇక మ్యాచ్ ఇండియా గెలుస్తుందనే భావంతోనే ఉన్నారు.
