Home / ANDHRAPRADESH / ఎంపీడీవోపై దాడి కేసు…ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

ఎంపీడీవోపై దాడి కేసు…ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. పార్టీకి తనను దూరం చేసేందుకు వైసీపీ మండల అధ్యక్షుడు కుట్ర చేశారని ఆరోపించారు. ఆయనే ఎంపీడీవోతో తనపై కేసు పెట్టించారని ఆరోపించారు. తనపై కేసు పెట్టించిన పెద్ద తలకాయ ఎవరో సీఎం జగన్ తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనపై సొంతపార్టీ నేతలు, మరికొందరు టీడీపీ నేతలు, పోలీసులు కలిసి కుట్ర చేస్తున్నారంటూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళి తే..ఓ లేఔట్ విషయంలో వెంకటాచలం ఎంపీవోడీ సరళకు, కోటంరెడ్డికి మధ్య వివాదం తలెత్తింది. లే అవుట్ విషయంలో తన మాట వినలేదని ఎంపీడీవో ఇంటికి కరెంట్ కట్ చేయించి, ఆమె ఇంటి ముందు చెత్త వేయించారంటూ కోటంరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సీఎం జగన్ దృష్టికి వెళ్లగా..చట్ట ప్రకారం ముందుకెళ్ళాలని, తప్పు చేస్తే ఎవరైనా ఒకే రీతిలో విచారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ ఉదయం కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెల్లూరులో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కాగా ఈ కేసులో బెయిల్‌ తెచ్చుకున్న కోటం రెడ్డి తనపై కుట్ర జరుగుతుందంటూఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాచలం ఎంపిడివో సరళ గారు నాపై అసత్య ఆరోపణలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని ఆయన అన్నారు. ఒకవేళ నేను ఎంపీడీవో ఇంటిపై దాడి చేశానని చెప్పినప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి..- కానీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంటికి వెళ్లింది..దీన్ని బట్టి ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారో అర్థమవుతుందని కోటం రెడ్డి అన్నారు.

చట్టానికి ఎవరు అతీతులు కాదని సీఎం జగన్ చెప్పారు.. ఆయన మాటలకు నేను గౌరవం ఇస్తున్నా, హర్షిస్తున్నా అని కోటంరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో, ఐపీఎస్ అధికారులపై దాడి చేస్తే చంద్రబాబు రాజీ చేశారు..కానీ మాది నిజమైన ప్రభుత్వం, సీఎం జగన్ చేసిన ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటించాడని కోటం రెడ్డి గర్వంగా చెప్పుకున్నారు. కాగా జిల్లా ఎస్పీకి నాకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి, ఇది నా దురదృష్టం…నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌కు ఎస్పీపై ఫిర్యాదు చేశానని…అధి మనసులో పెట్టుకుని ఎంపీడీవో ఇష్యూలో ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం జగన్ చెబితే వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసారని కోటంరెడ్డి వాపోయారు అర్ధరాత్రి నా ఇంటిపై, శ్రీకాంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. అయితే ఎంపీడీవో సరళ పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు కాకాణి అనుచరుడు ప్రదీప్ రెడ్డి పోలీసులను దారుణంగా మాట్లాడారని.. మరి స్టేషన్ లో ప్రదీప్ రెడ్డి మాట్లాడిన మాటలకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోటంరెడ్డి ప్రశ్నించారు.

మా బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో లే ఔట్ వేసాడు..ఆ లే ఔట్ కు నుడా, రెరా అనుమతులు ఖచ్చితంగా ఉన్నాయి.. లే ఔట్ కు కుళాయి కనెక్షన్ ఇవ్వాలని రెండు నెలలుగా ఎంపీడీవోని సరళని అడుగుతున్నా పట్టించుకోలేదని ఆయన అన్నారు. అంతే కాదు..ఎంపీడీవో సరళ నాకు 20 ఏళ్లుగా తెలుసు..ఆవిడకి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగితే మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దని చెప్పాడు అని సమాధానం చెప్పగా..నేను మా బావ అయిన ఎమ్మెల్యే కాకాణికి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగానని..- నీకు తెలీదు శ్రీధరా, ఇప్పుడు కుదరదు అని కాకాణి అనడంతో అంతటితో నేను సైలెంట్ అయిపోయానని..కానీ ఇలా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తారని అనుకోలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జగనన్నా ఇక్కడ పక్షపాతంగా విచారణ జరిగింది.. నా పట్ల, శ్రీకాంత్ రెడ్డి మీద కక్ష పూరితంగా పోలీసులు వ్యవహరించారు.. గత ప్రభుత్వ హయాంలోలాగా కొంతమందిలా నేను చీకట్లో చంద్రబాబు కాళ్ళు పట్టుకోలేదు. అటు కాకాణి అనుచరులతో పాటు ఇటీవల నేను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయమని నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు వెళ్ళానని, ఇప్పుడు వాళ్లపై నాకు అనుమానాలు ఉన్నాయని కోటంరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదులో నిజాలు ఉన్నాయని నిగ్గు తేలిస్తే నన్ను వెంటనే సస్పెండ్ చేయండి.. షోకాజ్ నోటీసులు కూడా అక్కర్లేదు, శాశ్వతంగా బహిష్కరించండి జగన్ అన్నా అంటూ కోటంరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగులారా…. మీరు బహిరంగ విచారణకు నన్ను పిలవండి, సిద్ధంగా ఉన్నాను.. నేను ఎంపీడీవో ఇంటిపై దాడికి పాల్పడ్డానని నిరూపిస్తే సరళ గారికి క్షమాపణ చెబుతాను..నిజం అని తేలితే సరళ గారి తల్లి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతానని కోటం రెడ్డి అన్నారు. నాకు పోరాటాలు కొత్తకాదు, ప్రజా ఉద్యమంలో పుట్టా, ప్రజా ఉద్యమంలోనే చస్తాను  కొన్ని మీడియా సంస్థలు, ప్రతినిధులు నన్ను వేధిస్తున్న మానసిక క్షోభకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు అని వందసార్లు చెబుతున్నా నమ్మరా.. నేను నిద్రపోవడం కోసం టాబ్లెట్స్ మాత్రమే వాడుతా..అని కోటంరెడ్డి స్పష్టం చేశారు. నా స్నేహితులు, నా సన్నిహితులు, కార్యకర్తల కోసం ఎంత దూరమైన పోరాడుతానని. నెల్లూరు రూరల్ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తా అని కోటం రెడ్డి తేల్చిచెప్పారు. మొత్తంగా ఎంపీడీవో సరళపై దాడి చేసారంటూ వచ్చిన ఆరోపణలపై కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. మరి ఈ కేసులో కోటంరెడ్డిపై సొంత పార్టీ నేతలు, టీడీపీ నేతలతో, పోలీసులతో కలిసి కుట్ర చేశారా…అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat