హన్మకొండలోని, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు
పాల్గొన్నారు. ఏడవరోజైన శనివారం నాడు స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల దేవిపీఠపూజ, చండీపారాయణం, చండీ హోమం, స్పటిక శివలింగానికి రుద్రాభిషేకం వంటి పూజాదికార్యక్రమాలను
నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ ఇంట్లో స్వామివారిని పలువురు ప్రముఖులు సందర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీమంత్రి బసవరాజు సారయ్య, జెడ్పీ ఛైర్మన్ సుధీర్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. దేవి నవరాత్రులలో భాగంగా కెప్టెన్ కుటుంబసభ్యులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దాండియా ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.