విశాఖపట్నం టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 503 పరుగులు వద్ద డిక్లేర్ ఇవ్వగా… సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత్ గట్టిగా ఆడింది. రోహిత్ శర్మ ధాటికి బౌలర్స్ బెంబేలెత్తిపోయారు. ఇక 394 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. విజయం కాకపోయినా కనీసం డ్రా ఐన చేసుకుంటారేమో అనుకుంటే మొదటికే మోసపోయారు. జడేజా, షమీ దెబ్బకు వివవిల్లాడిపోయారు. దాంతో 203పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు. అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విట్టర్ వేదికగా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసాడు. అంతేకాకుండా వైజాగ్ మ్యాచ్ లో ఈ విజయం చాలా స్పెషల్ అని అన్నాడు.
