ప్రతీ ఒక్కరి లైఫ్‌లో సెక్స్ అనేది చాలా కీలకం. మీరు సెక్స్ కోరుకొంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా వెంటనే ఆ పని కానిచ్చేయండి అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలను వెల్లడించారు.. మనసులోనే కోరిక పెట్టుకొని దాని కోసం వేచి ఉండకండి. ఒకప్పుడు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమంటే..మనం అతడిపైనే ఎమోషన్స్ పెంచుకోవడమనే విషయాలు ఇప్పుడు కనిపించడం లేదు. చరిత్రలోని దాడులు, అభిప్రాయాలు మన మీద బలవంతంగా రుద్దుతున్నారు. మన ఆచారాలు, సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదు అని కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కంగన మరో అడుగు ముందు వేసి.. పిల్లలు శృంగారాన్ని కోరుకొంటే సంతోషంగా ఫీల్ అవ్వాలి. సెక్స్ పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండాలి. నేను పెళ్లికి ముందే సెక్స్ విషయంలో యాక్టివ్‌గా ఉండటాన్ని చూసి నా తల్లిదండ్రులు షాక్ తిన్నారు. సెక్స్ విషయంలో పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని కంగన పేర్కొన్నారు.
Home / MOVIES / మీరు సెక్స్ కోరుకొంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా వెంటనే ..హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Tags comments controversial Heroine kangana ranaut