తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న మేళ్ల చెరువులో ప్రచారం సందర్భంగా అధికారుల అనుమతి లేకుండా డీజేలు పెట్టి వాహనదారులకు,ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. దీంతో మోడల్ కండక్ట్ ఆప్ లీడర్ వెంకయ్య పోలీసు అధికారులకు పిర్యాదు చేశారు.దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తీన్మార్ మల్లన్న,అతని అనుచరులు పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
