తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుండి సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ కుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం సమ్మె ప్రభావం ఏ విధంగా ఉందని సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ “గడవులోపు విధుల్లోకి చేరని సిబ్బందితో రాజీపడే ప్రసక్తే లేదు. వారిని తిరిగి తీసుకునే వీల్లేదు. ఆర్టీసీలో నూతనోధ్యాయం కోసం సరికొత్త చర్యలు తీసుకుంటాం. పండగ సీజన్లో కార్మికులు సమ్మెకు దిగడం చాలా బాధాకరం. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం పదివేలకు పైగా బస్సులు నడుస్తున్నాయి. అతికొద్ది రోజుల్లోనే ఆర్టీసీలో నియమకాలు చేపడతామని”చెప్పారని సమాచారం.
