తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై,వాటి పరిష్కారంపై చర్చించిన్నట్లు సమాచారం.
ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ కుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం సమ్మె ప్రభావం ఏ విధంగా ఉందని సీఎం ఆరా తీశారు. అయితే ఆర్టీసీ భవిష్యత్తుపై సీఎం మరికాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ కార్మికలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న అంశం ఉత్కంఠగా మారింది.