తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో అన్ని పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని, సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృది కార్యకలాపాల్లో కొత్త పుంతలు తొక్కాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అభిలషించారు.
లోక కళ్యాణార్ధం సితఫలమండిలోని ఉప్పలమ్మ సమేత కనక దుర్గ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన చండి హోమం లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.హోమం క్రతువును వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ దసరా పండుగకు ప్రాముఖ్యత ఉందని అన్నారు. అన్ని మతాల ప్రధాన పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యత కలిగిస్తోందని అన్నారు. corporator సామల హేమ తో పాటు నేతలు, నిర్వాహకులు పాల్గొన్నారు.
Post Views: 273