నవ్యాంధ్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,92,848 మంది వాలంటీర్లకు గాను 1,85,525 మంది విధుల్లో ఉన్నారు. తొలుత గ్రామవాలంటీర్లకు గౌరవవేతనంగా రూ. 5000/- గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా సీఎం జగన్ గ్రామవాలంటీర్ల వేతనాన్ని రూ. 5000/- నుంచి రూ.8,000/- లకు పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు గ్రామవాలంటీర్ ప్రధాన కార్యదర్శితో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం గ్రామవాలంటీర్ల వేతనాన్ని రూ.5000/- నుంచి రూ. 8,000/-లకు పెంచుతూ సీఎం జగన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా విధులు ప్రారంభించి నెల కూడా కాకముందే వేతనాలు పెంచుతూ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామవాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
