ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ జగన్ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలవరం వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని జగన్ కోరనున్నారు. అలాగే గోదావరి జలాలను సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించేందుకు ఆర్థిక సాయం చేయాలని, విశాఖపట్నం కాకినాడ పెట్రో కారిడార్ కు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇవ్వాలని కోరునున్నారు.ఇక జగన్ కోరికలకు రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు ఈ నెల 15న మోడీ ఏపీ కి వచ్చిన తర్వాత జగన్ నేరుగా ఢిల్లీ వెళ్లి మోడీని రిసీవ్ చేసుకున్నారు. అనంతరం రైతు భరోసా పథకం కింద రైతులకు ఒక్కో రైతుకు 12,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకం కార్యరూపం దాల్చిన సందర్భంలో మోడీ రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
