ప్రేమ కథలకు, హీరోయిజానికి మారు పేరు పూరీ జగన్. తన సినిమాలతో కుర్రాళ్లో ప్రేమపై కొత్త అర్ధాన్ని చెప్పిన పూరీ… హీరోయిజానికి సరికొత్త పంథా నేర్పారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో..ప్రేమికుల మధ్య జరిగే సన్నివేశాలు, మాటల
విషయంలో పూరీ స్టైల్ డిఫరెంట్. అందుకే తన సినిమాలు ఫెయిల్ అయినా..పాస్ అయినా తను మాత్రం ఫామ్ కొల్పొలేదు.ఇప్పటికీ, ఎప్పటికీ మాస్ డైరెక్టర్ గా టాప్ డైరెక్టర్ లిస్టులోనే ఉంటారు. అలాంటి పూరీది కూడా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంది. షూటింగ్ చేస్తుండగా..కనిపించిన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్న పూరీ.. సినిమాటిక్ గానే చేసుకున్నారు తన పెళ్లిని. అలాంటి పూరి భార్యయే అక్కడ కూర్చున్న ఆమె. భర్త ఎంత మాస్ డైరెక్టరో లావణ్య అంత కూల్ పర్సన్ పెద్దగా జనాలకు కనిపించని ఇల్లాలు. అయితే ఈ మధ్య ఇన్ స్టాలో కాస్త కనిపిస్తుంది. సమయం దొరికినప్పుడు ఇలాంటి ఫిక్స్ పెడుతుంది.