ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే చాలు అక్కడ పండుగ వాతావరణం మొదలయ్యేది. ఈతరం వాళ్లకి ఆ విషయాలు తెలియకపోవచ్చు గాని అప్పట్లో చిరంజీవి సినిమా వస్తే చాలు థియేటర్లు వద్ద సైకిల్ స్టాండ్ వారు కూడా కోటీశ్వరులు అయిన రోజులు ఉన్నాయి. అప్పట్లో అంత ఊపు ఉండేది చిరంజీవి అంటే. అంతేకాకుండా ఎడ్లబళ్ళలో కూడా సినిమాలకు వచ్చేవారు. ఆ తరువాత రాజకీయాలపై మగ్గు చూపించడంతో తన సినీ కెరీర్ కు బ్రేక్ వచ్చింది. దాంతో ఇక చిరు సినీ ఫీల్డ్ అయిపోయిందని అందరు భావించారు. కాని మల్లా తన 150 సినిమాతో ముందుకు వచ్చాడు. కాని అప్పటి ఊపు ఉండదని అందరు భావించారు. కాని సినిమా రిలీజ్ తరువాత అందరికి అర్ధమైన విషయం ఏమిటంటే అప్పటికీ ఇప్పటికీ చిరంజీవి క్రేజ్ ఒకలానే ఉందని తెలిసింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా సినిమా తీసాడు. ఈ సినిమాకు నెల్లూరులోని ఒక థియేటర్ కు రెండు బస్సులలో అభిమానులు సినిమాకు వచ్చారు. దీనిని స్వయంగా నిర్మాత ఎస్కేఎన్ ట్విట్టర్ లో పెట్టాడు.