దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్న జగన్ ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పట్టుచీర వెళ్లడంతో జగన్ తన శిరస్సుపై వుంచుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేసి వేద పండితులు ఆయనకు ఆశీర్వదించారు. అయితే అక్కడికి వచ్చిన జగన్ భక్తులకు సంబంధించి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే అమ్మవారిని ఏం కోరుకున్నారు అంటూ అక్కడి విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ చక్కటి సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారాణి జగన్ చెప్పడంతో అక్కడివారంతా హర్షం వ్యక్తం చేశారు.
