Home / ANDHRAPRADESH / ప్రధాని చేతుల మీదుగా ఈ నెల 15న రైతు భరోసా..జగన్ సంచలన నిర్ణయం

ప్రధాని చేతుల మీదుగా ఈ నెల 15న రైతు భరోసా..జగన్ సంచలన నిర్ణయం

వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన… సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat