విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అనంతరం నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ రోహిత్, మరో ఎండ్ లో పూజారా అద్భుతమైన బ్యాట్టింగ్ కనబరుస్తున్నారు. ఇక పుజారా టీ టైమ్ కి ముందు ఎల్బీ అపిల్ చేసినప్పటికీ తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇప్పటికి 246 పరుగులు లీడ్ లో ఉంది. అయితే కోహ్లి ఈరోజే డిక్లేర్ చేయనున్నాడు లేదా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.
