గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, గెలిచిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేశారు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. అలాంటి చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ఏపీ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. అంతేకాకుండా అఖండ మెజారిటీతో వైసీపీ ని గెలిపించారు. అప్పటినుండి ఆ పార్టీపై ఏదోక రూపంలో ఏడుస్తూనే ఉంది. అప్పటినుండి అనే విషయానికి వస్తే
*ఫలితాలు రాగానే ఈవీఎంల మీద పడి ఏడ్చాడు , అయినా జనం పట్టించుకోలేదు .
*వెంటనే ‘ వాయ్యా నువ్వెలా ఓడిపోయావయ్యా ‘ అంటూ ఏడుపు నాటకానికి తెరతీశాడు . అయినా జనం పట్టించుకోలేదు.
*ఆతరువాత ప్రజావేదికలో దోచుకున్నది కప్పెట్టటానికి అన్యాయంగా కూల్చేశారని ఏడ్చాడు.
*విద్యుత్ ఒప్పందాలు సమీక్ష అనగానే ‘ దోపిడీ మొత్తం బయటపడుతుందని కిందామీదా పడి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు .
*నాసిరకం బియ్యం అంటూ ఏడుపు నాటకానికి తెరతీశాడు .అయినా జనం పట్టించుకోలేదు.
*ఆదర్శ రైతులంటూ వేషగాళ్ళని తీసుకొచ్చి సినిమా ఏడుపులు ఏడ్చాడు .
*రివర్స్ టెండరింగ్ అనగానే ‘ నేనొప్పుకోను మాపచ్చ ముఠాకి అన్యాయం జరుగుతుందని ఏడ్చాడు .
*నాలుగురోజులు ‘ ఆత్మకూరు’ బాధితుల షెల్టర్ అంటూ అదో రకమైన ఏడుపు .
*కోడెలని హింసించి ఆఖరికి చంపేసి ‘ సానుభూతి నాటకం ఆడుతూ దానిని ఒక పదిరోజులు లాగుతూ ఏడ్చాడు అయినా జనం పట్టించుకోలేదు.
*నాలుగు లక్షలమంది వాలంటరీలు అనగానే గుండె పగిలేటట్లు ఏడ్చాడు . అయినా జనం పట్టించుకోలేదు.
*లక్షా ముప్పై వేల ఉద్యోగాలు సామాన్యులకి ఇచ్చేసరికి తట్టుకోలేక గుక్కపట్టి ఏడుస్తున్నాడు .
*ఇప్పుడు ఆఖరికి స్థాయిని మరిచి పేస్ బుక్ పోస్టులు చదువుకొంటూ ముక్కు చీదుకొంటూ ఒకటే ఏడుపు . అయినా జనం పట్టించుకోలేదు.
ఎన్ని రకాల ఏడుపులు డ్రామాలు వేసినా అటు చూస్తే జనం పట్టించుకోవటం లేదు , ఇటు చూస్తే సొంత పార్టీవాళ్ళు కూడా కామెడీగా నవ్వుకొంటున్నారు.బాబుగారూ , మీకు ఇంకా అర్థంకాని విషయం ఏమిటంటే మీరు ఇంక రాజకీయానికి దూరంగా ఉంటే మంచిదని ప్రజలందరూ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. రోజులు గడిచేకొద్ది మీపై ఉన్న ఆ కాస్త సానుభూతి కూడా పోతుంది. ఇప్పుడే మర్యాదగా తప్పుకుంటే మంచిదేమో..లేదంటే ఇంకెంత నవ్వులపాలవుతారో మరి.