ఏపీ అధికార వైసీపీ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు, నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆ పార్టీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీఐఐసీ చైర్మన్ పదవీతో గౌరవించిన సంగతి విదితమే. ఇటీవలే ఆర్కే రోజా చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో చైర్మన్ గా ఆర్కే రోజాకు నెలకు రూ.3.82 లక్షల ను జీత భత్యాలుగా కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇందులో రూ.2 లక్షలు వేతనం.. వాహానానికి రూ. 60వేలు, అధికారక క్వార్టర్స్ లో నివసించకుండా ఉంటే ఇంటికోసం యాబై వేలు.. వ్యక్తిగత సిబ్బంది వేతనాల కోసం డెబ్బై వేలు. ఫోన్ కోసం రెండు వేల రూపాయలను కేటాయించింది.
