ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కె రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా..దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాని అన్నారు.గతంలో కంటే ప్రస్తుతం ఉన్న దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి.గత ప్రభుత్వ హయాంలో ఉత్సవాలు అస్తవ్యస్తంగా జరిగాయని అన్నారు.
