తెలంగాణ రాష్ట్ర మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలకు సమీపంలో దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింహులు అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
అతడు గాయపడి రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. అదే సమయంలో సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్ మహనగరానికి వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద విషయాన్ని గుర్తించి తన కాన్వాయ్ ను ఆపి మరి ఆవ్యక్తిని 108లో ఎక్కించారు. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.