తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని ,అడవుల శాతాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజానీకం కూడా పాల్గోని తమవంతు పాత్ర పోషిస్తూ మొక్కలను నాటుతూ హరితహారం లో భాగస్వాములవుతున్నారు.
ఈ క్రమంలో హరితహారానికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. బ్రెజిల్ లో జరిగిన పచ్చదనం పెంచేందుకు,అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి ఇరవై ఐదువ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సమావేశంలో రాష్ట్ర అదనపు పీసీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్ వివరించారు.
రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్-ములుగు అటవీ ప్రాంతంలో నాటిన మొక్కల దృశ్యాలను ఈ సమావేశంలో ప్రదర్శిస్తూ వివరించారు. ఈ సమావేశాల్లో మొత్తం 110దేశాల నిపుణులు,శాస్త్రవేత్తలు,పర్యావరణ వేత్తలు
పాల్గొన్నారు.