హిట్ మేన్ రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించాడు. తాను ఓపెనర్ గా వచ్చిన మొదటి మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 176 పరుగులు చేసిన రోహిత్, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో కూడా శతకం కొట్టాడు. కెప్టెన్ కోహ్లి ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు కాదని నిరూపించాడు. మరో పక్క సెహ్వాగ్ తో పోల్చడం సరికాదన్న అభిమానులే ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వన్డేలు, టీ20 లే కాదు టెస్టుల్లో కూడా నేనే తోపు అని నిరూపించుకున్నాడు.