రాజకీయాలు తెలిసిన వాడు, పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో పెరిగిన వాడు..అతనికి తెలియదా ఎక్కడ గట్టిగా ఉండాలి, ఎక్కడ వదిలిపెట్టి ఉండాలని సరిగ్గా అదే చేస్తున్నాడు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయాలి తప్ప కక్షలు తీర్చుకోవడానికి కాదని మరోసారి రుజువు చేస్తున్నాడు. గత టీడీపీ ప్రభుత్వం ప్రతి పక్షం ఎక్కడ దొరికితే అక్కడ అణిచివేయడానికి ప్రయత్నించింది. కనీసం వైసీపీ నాయకుల ఊసే లేకుండ పాలన చేసింది. అలాంటి సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజల్లోకి వెళ్లిపోవటం.. అక్కడ నుంచి మొదలైన జగన్ ప్రభంజనం నేడు సీఎంగా చూసే వరకు ఆగలేదు. అయితే పాలనలో కొత్త పంథాను కొనసాగిస్తున్నారు జగన్. రాజకీయాలంటే ప్రజా సేవ చేసేందుకు తప్ప కక్షలు, అక్కసులు తీర్చుకోవటం కాదని రుజు చేస్తున్నారు. తాజాగా జగన్ పథకాలు రిలీజ్ చేసి ప్రజల ముఖంలో చిరు నవ్వు చూసే పనిలో పడ్డారు. ఆ క్రమంలో పలు పథకాలను ప్రారంభించారు.అందులో భాగంగా ఓపెనింగ్ కార్యక్రమం శిలాఫలకాలపై మాజీ లీడర్ అచ్చెంనాయుడి పేరు పెట్టి హౌరా అనిపించారు. ఇది చూసిన టీడీపీ నాయకులు సైతం వారెవ్వా అంటున్నారు. కొత్త తరం రాజకీయాలకు తెరలేపాడని అంటున్నారు. కులం చూడం, మతం చూడం పార్టీ చూడం ప్రాంతం చూడమని ఎన్నికల్లో చెప్పారని, అదే చేస్తున్నారని చెబుతున్నారు.
