రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పనిచేస్తున్న 3720 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే వారి వేతనాలు ఆగిపోయాయి. అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో వెంటనే వేతనాలు విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంతేకాకుండా అకౌంట్స్ డైరెక్టర్కు ఈ లేఖ రాశారు. అధికారులు చొరవ ప్రభుత్వ పనితీరు కారణంగా తమకు వేతనాలు విడుదలయ్యాయి అని జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.