Home / MOVIES / ప్రేమించిన వ్యక్తి తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి చెప్పిన నటి

ప్రేమించిన వ్యక్తి తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి చెప్పిన నటి

బిగ్‌బాస్‌ ఇంటిలో మొదలయ్యే ప్రేమకథలు- వివాదాలు, కంటెస్టెంట్ల వ్యక్తిగత విషయాలపై చర్చలే షోకు ఆదరణ తెచ్చిపెడతాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా తాజాగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేషమీ దేశాయ్‌, సిద్దార్థ్‌ శుక్లా(చిన్నారి పెళ్లి కూతురు ఫేం), షెనాజ్‌ గిల్‌, పారస్‌ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ(కోడలా కోడలా ఫేం- గోపిక), కోయినా మిత్రా, దల్జీత్‌ కౌర్‌, సిద్దార్థ్‌ డే, ఆర్తీ సింగ్‌, ఆసిమ్‌ రియాజ్‌, అబూ మాలిక్‌, షఫాలీ బగ్గా, మహీరా శర్మ వంటి సినీ సెలబ్రిటీలతో బిగ్‌బాస్‌ హౌజ్‌ నిండిపోయింది.

ఈ క్రమంలో ఒక్కో సెలబ్రిటీ ఇప్పుడిప్పుడే ఇతర ఇంటి సభ్యులతో క్లోజ్‌ అవుతున్నారు. తమ వ్యక్తిగత విషయాలను సైతం షేర్‌ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్‌ కోయినా మిత్రా ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అంటూ తోటి సభ్యులు ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ‘ కొన్నేళ్ల క్రితం టర్కీకి చెందిన వ్యక్తిని ఎంతగానో ప్రేమించాను. మొదట్లో బాగానే ఉండేవాడు. కానీ రాను రాను తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. తను చాలా పొసెసివ్‌. మన పెళ్లి అయ్యాక టర్కీలోనే ఉండాలని చెప్పాడు. అప్పుడు నువ్వేం చేస్తావు. నన్ను ఎలా చూసుకుంటావు అని అడిగాను. ఇందుకు బదులుగా మొదట నా పాస్‌పోర్టు కాల్చి పడేస్తానని చెప్పాడు. టర్కీ దాటి ఎక్కడికీ వెళ్లనివ్వనని, తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని చెప్పాడు. అంతేకాదు ఓసారి ముంబైలో మేమిద్దరం నా అపార్టుమెంటులో ఉన్న సమయంలో సైకోలా ప్రవర్తించాడు. నన్ను బాత్‌రూంలో బంధించి తాళం వేసి వెళ్లిపోయాడు. నేను ఏ పని చేయడానికి వీళ్లేదని.. అందుకోసం బయటికి వెళ్తే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చాడు. తన ప్రవర్తనతో విసిగిపోయి బంధానికి స్వస్తి పలికాను’ అని ప్రేమించిన వ్యక్తి తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి ఇంటి సభ్యులతో షేర్‌ చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని కెరీర్‌పై దృష్టి సారించానని చెప్పుకొచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat