Home / ANDHRAPRADESH / అనంతలో అత్యంత దారుణ ఘటన..!

అనంతలో అత్యంత దారుణ ఘటన..!

అనంతపురం జిల్లాలోని నార్ప‌లలో దారుణం చోటుచేసుకుంది. కన్నూమిన్నూ కానక చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డాడో కామాంధుడు. వివరాలు.. నార్పలకు చెందిన ఆరేళ్ల చిన్నారి తమ ఇంట్లో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడికి చేరుకున్న నారాయణస్వామి అనే వ్యక్తి తలుపులు మూసి బాలికపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి చేష్టలతో బెంబేలెత్తిపోయిన చిన్నారి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చిన్నారి ఆర్తనాదాలు విన్న స్థానికులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నారాయణస్వామికి స్థానికులు దేహశుద్ధి చేశారు. కాగా దేశ వ్యాప్తంగా యువతులు, మహిళలపైనే కాకుండా పసిపిల్లలపై కూడా అత్యాచార పర్వాలు కొనసాగుతునే ఉన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat