తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో జరిగిన ‘మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”భారతదేశంలో అత్యంత డైనమిక్ రాజకీయ నాయకుడు కేటీఆర్.
ప్రతి ఒక్కరినీ హైదరాబాద్ వైపు నడిపించే సత్తా తన సొంతం.ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం, అభిమానం ఉంది ఎందుకంటే ఆయన మన దేశంలో అత్యంత ప్రతిభావంతులైన మంత్రులలో ఒకరు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
మీరు హైదరాబాద్ వస్తే మీకు ప్రతిభావంతులైన మంత్రి కేటీఆర్ గారి సారథ్యం తోడుగా ఉంటుంది.కేటీఆర్ గారు భాగస్వామ్య స్ఫూర్తిని నమ్ముతారు, ఆ దిశలోనే తన కార్యాచరణ ఉంటుంది. తాను ఒక గొప్ప ఫెసిలిటేటర్ మరియు ప్రపంచంలోని మరే ఇతర ప్రదేశంలో కూడా మీకు ఆయన కంటే మంచి ఆతిథ్యం ఇచ్చేవారు దొరకరని అన్నారు.
Post Views: 263