Home / ANDHRAPRADESH / చంద్రబాబు, ఎల్లోమీడియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!

చంద్రబాబు, ఎల్లోమీడియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!

ఏపీలో సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తూ, రాజధానితరలింపు, పోలవరం రివర్స్‌టెండరింగ్, అద్దె కొంప కూల్చివేత, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య, సోషల్ మీడియా బూతుపురాణం..ఇలా వరుస డ్రామాలతో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు, లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియాను కలిపి ట్విట్టర్‌లో తనదైన సెటైరికల్ ట్వీట్లతో ఉతికి ఆరేశాడు. వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని అనరాని మాటలంటున్నారని, జుగుప్సాకరంగా తిట్టిపోస్తున్నారంటూ చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి మరీ గగ్గోలు పెట్టాడు.. దాదాపు గంటసేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నానా హంగామా చేశాడు. ఎవరో సోషల్ మీడియాలో తెలుగుదేశం మహిళా నేతను పచ్చి బూతులతో పోస్ట్‌లు పెట్టారంట. ఆ బూతులను బాబుగారు పెద్ద స్క్రీన్ మీద వేసి మరీ చూపించారు. ప్రొజెక్టర్ ద్వారా చూపించడమే కాదు, ఆ బూతులను స్వయంగా బాబోరే చదవి మరీ వినిపించారు కూడా.

తాజాగా చంద్రబాబు విమర్శలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సిగ్గు లేని బతుకులు ఎవరివో చెప్పమంటే తండ్రీకొడుకుల పేర్లు ఫస్టుంటాయి. ఆ లిస్టులో కిరసనాయిలు తప్పని సరిగా ఉంటాడు….అంతగా అన్‌పాపులర్ అయ్యారు వీళ్లు అంటూ చంద్రబాబు, లోకేష్‌, ఓ ఎల్లోమీడియా అధిపతిని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛకు వీరి నిర్వచనాలు వేరేలా ఉంటాయి. వీళ్లు జన్మలో మారరు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఇక వైఎస్సార్సీపైన, వైయస్‌ జగన్‌ గారిపైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి, 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు…మీ బానిస పత్రికలు, ఛానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా మీ అరాచకాలన్నిటినీ బయటపెట్టింది. అందుకేనా ఈ ఏడుపు? అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు తీవ్ర మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. తనను అందరూ మర్చిపోతున్నారనే భయం వెంటాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వాల్స్‌పై ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పోస్ట్ చేస్తారు. అనాగరిక దూషణలుంటే fbకి ఫిర్యాదు చేయొచ్చు అంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఇక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని రాయించినా సీఎం జగన్ స్పందించక పోవడంతో బాబుగారిలో నిస్పృహ కట్టలు తెంచుకుందని, పాపం చంద్ర‘జ్యోతి’ ఎన్ని మంటలు రాజేయాలని చూసినా లాభం లేకుండా పోయిందనేదే బాబుగారి అసలు బాధ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగంగా కామెంట్ చేశారు. అయినా మీ పుత్ర రత్నం పెట్టిన ట్వీట్లు మీకు సుమతి శతకాల్లా కనిపిస్తున్నాయా బాబు గారూ? అంటూ విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మొత్తంగా సోషల్‌మీడియాలో బూతుపురాణం అంటూ చంద్రబాబు చేసిన డ్రామాకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat