తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా శ్రేణులు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కారణం ఏమిటంటే గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా జగన్ పై వైసీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ శ్రేణులు పోస్టులు పెట్టారు. వైసీపీ మాత్రం తమ గళాన్ని బలంగా వినిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చంద్రబాబు వైఫల్యాలను బలంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళింది. కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా సోషల్ మీడియా శ్రేణులను నిరుత్సాహ పరచలేదు. ధైర్యం కోల్పోవద్దని మన ప్రభుత్వం వస్తుందని అని సిద్ధాంతపరంగా టీడీపీ వైఫల్యాలని ఎండగట్టాలని కోరారు. కానీ ఏనాడు అధైర్యపడలేదు కేడర్ ను నిరుత్సాహ పరచలేదు. సోషల్ మీడియా కేసులకి గగ్గోలు పెడుతున్నారు. ఇవి చూస్తున్న వైసీపీ శ్రేణులు మా పై కేసులు పెట్టినప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేసామని, టీడీపీ పని ఇలా అయిపోయింది అంటూ ఆశ్చర్యపడుతున్నారు. మరోవైపు సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ఇలా భయానికి గురి అయితే కార్యకర్తల పరిస్థితి ఏమిటి అని చర్చిస్తున్నారు.
