గడిచిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దెబ్బ తగలబోతోంది. జనసేన పార్టీకి మరో నేత షాక్ ఇవ్వనున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీని వీడనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఆకుల జనసేన తరపున రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఆకుల బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల రావెల కిషోర్‌బాబు కూడా జనసేనను వీడి బీజేపీలో చేరారు.
