విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు ఎనిమిది వికెట్లు నష్టానికి 385 పరుగులు చేసారు. ఇందులో ఎల్గర్, డీకాక్ శతకాలు సాధించి అజేయంగా నిలిచారు. ఇంక చెప్పాలంటే భారత్ కు ధీటుగా సమాధానం ఇచ్చారని చెప్పాలి. మరోపక్క అశ్విన్ తనదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శించాడు. జట్టులో ప్లేస్ సాధించిన అశ్విన్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది వేచి చూడాల్సిందే.
