విజయవాడ దుర్గమ్మ అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందంటూ టీడీపీ నేత దేవినేని ఉమా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వంలో చీర దొంగలు, క్షుద్ర పూజలు చేసేవాళ్లు లేరని అన్నారు. తమలాగే అందరూ ఉంటారని భావించే దేవినేని ఉమా బుద్ధి ఇక మారదా అని విష్ణు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని మరో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆరోపించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు లేకపోవడం వల్లనే మీరు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘అమ్మవారి దీవెనలు మాకు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మేము అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాము. మీరు మోకాళ్ల మీద నడిచి వచ్చినా మీ పాపాలు పోవు’ అని విమర్శించారు.
