పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై టీమిండియా మాజీ కెప్టెన్,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
వీటిపై దాదా స్పందిస్తూ యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్ గా అతనేంటో యావత్తు ప్రపంచానికి తెలుసునన్నారు. కానీ యూన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగతో అప్రతిష్ఠ పాలయ్యారు . పాకిస్థాన్ లాంటి దేశానికి శాంతి చాలా అవసరం. ఇలాంటి సమయంలో ఇమ్రాన్ ఖాన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికై ఇమ్రాన్ ఖాన్ దేశం గురించి.. ప్రజల గురించి ఆలోచించాలని దాదా హితవు పలికారు.