తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజభవన్ ప్రాంగణంలో నేడు ఐదవ రోజు ‘వేపకాయల బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నరు డా. తమిళిసై సౌందరరాజన్ మాట్లాడూతూ, మనం గత ఐదు రోజులుగా జరుపుకుంటున్న పపు బతుకమ్మ, నృత్య బతుకమ్మ, వాద్య బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ…
ఇలా మనం జరుపుకునే పండుగలు మన సాంప్రదాయాలతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడేవిగా ఉంటాయని, అలాగే ఈరోజు జరుపుకునే బతుకమ్మలో అనగా వేపలో అనేక ఔషద గుణాలు ఉంటాయని, ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని అన్నారు.
ఈ వేడుకలో వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. అనంతరం రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు మరియు విద్యార్థులు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.‘బతుకమ్మ’ పండుగ వేడుకలను రాజభవన్ ప్రాంగణంలో ఆఖరి రోజుగా రేపు నిర్వహించబోయే బతుకమ్మ వేడుకలలో విశేషమేమంటే గవర్నరుగారి చేతులమీదుగా బతుకమ్మ కానుకగా అందుకున్న చీరలను కట్టుకుని రాజభవన్ లో పనిచేసే మహిళా ఉద్యోగులు మరియు ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.