గోపీచంద్ సినిమాకు సర్వం సిద్దమైంది. ముందుగా అనుకున్నట్టుగానే సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ఈరోజు పూజ కూడా చేసారు. దీనికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఆహ్వానించారు. ఆయన చిత్రానికి సంబంధించి క్లాప్ చేసారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి గాను హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఈ డైరెక్టర్ తో రెండు చిత్రాలు చేసింది. ఇందులో బెంగాల్ టైగర్ సినిమాకి అయితే ఏరికోరి ఎన్నుకున్నడు. అంతలా ఆమెలో ఏముందో తెలియదు గాని ఈ సినిమాకు కూడా తననే సెలెక్ట్ చేసుకున్నాడు సంపత్ నంది. దాంతో డైరెక్టర్ పై కామెంట్స్ వస్తున్నాయి. ఇక చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
