మయాంక్ అగర్వాల్… ఈ రెండు రోజుల్లో అభిమానుల నోట ఎక్కువగా వినిపించే పేరు. ప్రపంచ కప్ లో భాగంగా తిట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు పొగడ్తలతో ముచ్చుతున్నారు. సౌతాఫ్రికా టెస్ట్ లో భాగంగా రెండో రోజు సెంచరీ సాదించాడు. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 176 పరుగులు సాధించాడు. ఇక అగర్వాల్ ను అవుట్ చేయడానికి సఫారీలు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతడిని ఆపడం కష్టమే. ఇక ఈ క్రమంలోనే డబుల్ సెంచరీ కూడా పూర్తిచేసుకున్నాడు.
