తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన జిల్లా ఎస్పీ చందనదీప్తి గురించి తెలుగురాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మెదక్ ఎస్పీగా విధి నిర్వహణలో తన మార్క్ చూపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. తన తెలివితేటలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. పనితీరుతోనే కాకుండా అందంతోనూ, మోటివేషనల్ స్పీచ్ తోనూ ఆమె పేరుతెచ్చకున్నారు. ఇటీవలే ఎస్పీ చందన దీప్తీకి వివాహం నిశ్చయమైంది, ఈ నెలలోనే ఆమె వివాహం.. హైదరాబాద్‌లో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆమె తన పెళ్లికి రావాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, భారతికి ఆహ్వాన అందజేశారు. ఈ రోజు ఉదయం అమరావతిలోని సీఎం జగన్ ఇంటికి వెళ్లి తనకు కాబోయే భర్తతో కలిసి వివాహ పత్రిక అందజేశారు. జగన్ దంపతులు దీప్తిని అభినందించారు.
