ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు 13 రాష్ట్రాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ తాజా బులిటిన్ లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్నాటక, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్, పంజాబ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశముందని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది.
