కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. పార్టీలు కూడా చూడం.. ఇవీ ఎన్నికలకు ముందు, తర్వాత సీఎం జగన్ చెప్పినమాటలు. చెప్పినమాట ప్రకారం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి అక్టోబర్ 2న మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా గ్రామ స్వరాజ్యానికి శ్రీకారంచుట్టారు. టీడీపీ నాయకుల కుటుంబాలని తెలిసినా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారిలో ఎంతోమంది టీడీపీ నాయకుల కుటుంబాలకు చెందినవారున్నారు. ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా పనిచేసిన వారు కూడా ఉద్యోగాల్లో చేరుతున్నారు. పేపర్ లీకై ఉంటే మాపార్టీవారికే ఉద్యోగాలివ్వాలని టీడీపీ కుటుంబ సభ్యుల పిల్లలకు ఇవ్వకూడదని సీఎం జగన్ భావిస్తే ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు దక్కేవి కాదు.. కానీ జగన్ అలా భావించలేదు..
దేశానికి యువత విలువ తెలిసిన ఓ యువ ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాల్లో పారదర్శకత పాటించారు. ప్రతీఏటా జనవరిలో పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పడంతో నిరుద్యోగ యువతకు మేలు చేయాలన్న ఆయన ఆలోచనలు అర్ధమవుతున్నాయి. సచివాలయాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూనే మరోపక్క గ్రామస్థాయి నుంచే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసి చూపిస్తున్నారు. 72 గంటల్లో సమస్యలు పరిష్కరిస్తానని నిరూపించడానికి గ్రామ సచివాలయ ఉద్యోగులు వస్తున్నారు. ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష, ఓర్పు ఉన్న యువతతో తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకున్న చంద్రబాబును 40ఏళ్ల కుర్రాడు తన పనితనంతో ఢీకొడుతున్నాడు. నాలుగు నెలల్లోనే 4 ఉద్యోగాలివ్వడం ద్వారా తన ప్రయాణం ఎలా ఉండబోతుందో ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. వేలకోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచిన చంద్రబాబును నాలుగు నెలల్లో చంద్రబాబు దూషించలేదు. ఆంధ్రాన్ని అంధకారంలో నెట్టి పోలవరం ప్రాజెక్టు చేపట్టాలంటేనే డబ్బులు పుట్టని పరిస్థితి సృష్టించినా జగన్ రివర్స్ టెండరింగ్‌లో వందల కోట్ల మిగిల్చిన సంఘటనలే ఆయన పనితనానికి నిదర్శనం.