మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్పై కేసు నమోదైంది. వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు.. జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు. క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని భార్గవ్‌రామ్ బెదిరించారని శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్గవ్రామ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.