ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ పరిపక్వత చాటుకున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. అక్కడే పైలాన్‌ను ఆవిష్కరించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సీఎం ఆవిష్కరించిన పైలాన్ లో టీడీపీ నేత శాసనమండలి నాయకుడు యనమల రామృష్ణుడి పేరు కూడా వేయించారు. గత పాలనలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా చంద్రబాబు గేలిచేస్తూ మాట్లాడేవారు.
మీరు అడ్డుకుంటున్నారు.. మీకు సంబంధం లేదంటూ ప్రజలముందే చెప్పేవారు. ముఖ్యంగా పార్టీ మారితేనే నియోజకవర్గానికి నిధులిస్తానంటూ చెప్పేవారు. అయితే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయంగా విబేధాలు ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాలనాపరంగా అవి చూపించకూడదని, జగన్ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా తన హుందాతనాన్ని కాపాడుకుంటున్నారంటూ చెప్పుకుంటున్నారు.