ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటే యావత్ ప్రపంచ జట్లు వణుకుతున్నాయి. వారి ఆట చూస్తే ఎంతటివారైన గమ్మున కుర్చోవాల్సిందే. ఇంతకు క్రికెట్ ఆస్ట్రేలియా అంటే అబ్బాయిల జట్టు అనుకుంటున్నారేమో కాదండి అమ్మాయిలు. ఏ ఫార్మాట్లో ఐన చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు పూర్తయ్యాయి ఇందులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఈరోజు మూడో మ్యాచ్ జరగగా మొదట బ్యాట్టింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్స్ లో ఏకంగా 226 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ అలిస్సా హీలీ 61 బంతుల్లో 148 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందులో 19 ఫోర్లు, 7సిక్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా 46 బంతుల్లోనే సెంచరీ చేసింది.