మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చూపులకు ఈరోజుతో వారి ఆశలు నెర్వేరాయి. ఎక్కడ చూసినా థియేటర్లు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి చిత్రంపై కామెంట్స్ చేసింది. సైరా మేకర్స్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలని, ఇంతటి పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి గారిని చూసి గర్వంగా ఉందని పోస్ట్ చేసింది. ఇప్పటికే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి ఎలా విరిచుకుపడుతుందో తెలిసిందే. అలాంటిది ఈ చిత్రం పై పాజిటివ్ టాక్ ఇచ్చిన శ్రీరెడ్డి ని చూసి అభిమానులు ఎలాంటి రిప్లై ఇస్తారో మరి..!
